Wednesday, January 19, 2011

నాగ్ గగనం ఫిబ్రవరి లో రిలీస్

1999లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కాంధహార్‌ విమాన హైజాక్‌ సంఘటన తెరరూపం దాల్చనుంది. మొదట మలయాళంలో మోహన్‌లాల్‌, అమితాబ్‌ చేశారు. కానీ బాక్సీఫీస్‌ ముంగిట పెద్దగా విజయం సాధించలేదు. ఈసారి తెలుగు, తమిళ భాషల్లో…’గగనం’, ‘పయనం’ అనే పేర్లతో విడుదలవనుంది. ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. దీని గురించి నాగార్జున మాట్లాడుతూ…’ఓ సంఘటనలో చిక్కుకున్న కొంతమంది ఉద్వేగాలే కథాంశం. నాటి సంఘటనలో ప్రజల ఉద్వేగం, ప్రయాణికుల ఆందోళన ఇందులో చూపాం. అదే సమయంలో నాటి ప్రభుత్వం ఎలా స్పందించింది ! అన్నది కూడా ఉద్వేగభరితంగా ఉంటుంది’ అని అన్నారు.

1999 డిసెంబర్‌లో పాకిస్తాన్‌ తీవ్రవాదులు భారతీయ విమానాన్ని హైజాక్‌ చేశారు. తీసికెళ్లి ఆఫ్ఘనిస్తాన్‌లో దించారు. అప్పుడు ఆ విమానంలో దాదాపు 180 మంది ఉన్నారు. తీవ్రవాదుల డిమాండ్‌ మేరకు ప్రభుత్వం స్పందించటంతో ప్రయాణికులు సురక్షితంగా విడుదలయ్యారు. దీన్ని కథాంశంగా చేసుకొని అల్లుకున్న చిత్రం ‘గగనం’. ‘రగడ కమర్షియల్‌ మూవీ. రెగ్యులర్‌ మాస్‌ ఎలిమెంట్‌తో వచ్చిన సినిమా. ‘దబాంగ్‌’తో దీన్ని పోల్చవచ్చు. కానీ గగనం ఓ ప్రయోగమని చెప్పొచ్చు. కేవలం కథ కోసమే కథనం అల్లుకున్నాం’ అని నాగ్‌ వివరించారు.